News October 22, 2025

ఎస్.ఆర్.శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

image

ప్రజల అధికారిగా ఎస్.ఆర్. శంకరన్ ప్రసిద్ధి చెందారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శంకరన్ జయంతిని కలెక్టర్ కార్యాలయలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, ఇతర అధికారులు పూలమాలలు చేసి నివాళులు అర్పించారు. ప్రజలతో కలిసిమెలసి పని చేసిన వ్యక్తి శంకరన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి శంకరన్ తన జీవితాన్ని అంకితం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు. వాగులు, నదులు దాటుటకు, ఈదుటకు ప్రయత్నం చేయవద్దన్నారు.

News October 22, 2025

పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రభుత్వాధికారి కథ ఇది.!

image

1957 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి S.R. శంకరన్ పేరుమీద మన గుంటూరు కలెక్టరేట్ ఒక కాన్ఫరెన్స్ హాలు ఉందని మీకు తెలుసా?. S.R శంకరన్ 1934, అక్టోబర్ 22న జన్మించారు. 1957లో IASగా ప్రస్థానం మొదలుపెట్టి, 1992లో పదవీ విరమణ చేశారు. ప్రజాసేవ కోసం పెళ్లి దూరంగా ఉన్నారు. తనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని తిరస్కరించడమే గాక, ఆ విషయం ప్రచురించవద్దని పత్రికా విలేకరులను ప్రాథేయపడ్డారు.

News October 22, 2025

GNT: వారు తడబడినా.. మనమే ఆత్మవిశ్వాసం నింపాలి.!

image

ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. గుంటూరు జిల్లాలో పెద్దలలో తడబడటం సుమారు 1% వరకు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. పిల్లల్లో మొదట్లో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సమస్యను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. స్పీచ్ థెరపిస్టులు తడబడే సహాయం చేస్తున్నప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ఈరోజు ప్రధాన ఉద్దేశం.