News November 29, 2025

ఎస్.కోటకు ‘నో’ చెప్పిన సీఎం..!(1/1)

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా <<18425803>>ఎస్.కోట<<>> ప్రజలకు కూటమి ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామి అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల ఎస్‌.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాల పునర్విభజనపై చర్చ జరిగినప్పటికీ ఎస్‌.కోట విలీన అంశం ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం ఆ ప్రాంత ప్రజల్లో చర్చకు దారి తీసింది.

Similar News

News December 1, 2025

CSIR-IHBTలో ఉద్యోగాలు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 1, 2025

AP న్యూస్ రౌండప్

image

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్‌లో రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్‌ను టూరిజం, ఇండస్ట్రీస్‌తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆల‌యాల్లో రద్దీపై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

News December 1, 2025

ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాను: MP

image

రామగుండం నియోజకవర్గంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడును సోమవారం ఢిల్లీలో కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈనెల 3, 4 తేదీలలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం రామగుండం ప్రాంతాన్ని సందర్శించి, కొత్త ల్యాండ్ సర్వే చేస్తుందన్నారు. భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.