News November 29, 2025
ఎస్.కోటకు ‘నో’ చెప్పిన సీఎం..!(1/1)

జిల్లాల పునర్విభజనలో భాగంగా <<18425803>>ఎస్.కోట<<>> ప్రజలకు కూటమి ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామి అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాల పునర్విభజనపై చర్చ జరిగినప్పటికీ ఎస్.కోట విలీన అంశం ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం ఆ ప్రాంత ప్రజల్లో చర్చకు దారి తీసింది.
Similar News
News December 5, 2025
నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం

ప్రపంచ జనాభాకు అందే ఆహారంలో 95శాతం నేల నుంచే అందుతోంది. అందుకే మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. అందుకే భూమి ప్రాధాన్యత, సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానం చేసింది. 2014 DEC-5 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి: వద్దిరెడ్డిగూడెం వాసులు

నల్గొండ జిల్లా గుర్రంపోడు గ్రామ పంచాయతీ ఆవాస ప్రాంతాలైన వద్దిరెడ్డిగూడెం, శాంతినగర్‌ను కలిపి ప్రత్యేక పంచాయతీ చేసే వరకు ఎన్నికలు నిలిపివేయాలని వద్దిరెడ్డిగూడెం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గుర్రంపోడు పంచాయతీలో మొత్తం 2,700 మంది ఓటర్లు ఉండగా వద్దిరెడ్డిగూడెం, శాంతినగర్‌లో 340 ఓట్లు ఉన్నాయని, గుర్రంపోడు వారే సర్పంచ్, ఉప సర్పంచ్‌గా ఉంటున్నారని, దీంతో తమ గ్రామాలు అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు.
News December 5, 2025
పార్వతీపురం: విద్యార్థులు నా ఆలోచనకు దగ్గరుండాలి.. సీఎం

భామిని ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మెగా PTM కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసి, ప్రదర్శించిన 3D ప్రింటర్‌ను సీఎం ఆసక్తిగా తిలకించారు. సాంకేతికతతో తయారు చేసిన 3D ప్రింటర్ ఉపయోగాలను విద్యార్థులు సీఎంకు వివరించారు. నా ఆలోచనకు మీరు దగ్గరుండాలని విద్యార్థులకు సీఎం సూచించారు. విద్యార్థులను అభినందించారు.


