News March 2, 2025

ఎస్.కోటలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

ఎస్.కోటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. CI నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సీతంపేటకి చెందిన నాగభూషణం(58) ఎస్.కోట రైతు బజారు ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 2, 2025

మహిళా సిబ్బందికి యోగా తరగతులు: ఎస్పీ

image

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మహిళా పోలీసు సిబ్బందికి ఆదివారం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యోగ అనేది శరీరానికి, మనస్సుకి, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని అన్నారు. యోగ తరగతులు మహిళాలకు ఉపయోగకరమన్నారు.

News March 2, 2025

విజయనగరం వ్యాయమ ఉపాధ్యాయుల జిల్లా సంఘం ఎన్నిక 

image

వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎన్నికైన వెంకటనాయుడు పెంట జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నాడు. విజయనగరంలో ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ఎంపికపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాయమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వీరు తెలిపారు. 

News March 2, 2025

చీపురుపల్లి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్

image

చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ZPఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!