News September 21, 2025
ఎస్.కోట: పిడుగుపాటుతో మహిళ మృతి

ఎస్.కోట మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి సింబోయిన చెల్లమ్మ అనే గిరిజన మహిళ మృతి చెందింది. ఎస్.కోట రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో 15 సంవత్సరాలుగా భర్త కొత్తయ్యతో కలిసి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. శనివారం పొలానికి వెళ్లిన ఆమె రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో భర్త వెళ్లి చూడగా పాకలో చనిపోయి ఉంది. సాయంత్రం పిడుగు పడి మృతి చెందినట్లు గుర్తించారు.
Similar News
News September 21, 2025
విజయనగరంలో ఘనంగా గురజాడ జయంతి

విజయనగరం జిల్లా కేంద్రంలో గురజాడ వెంకట అప్పారావు జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురజాడ నివాసంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా, రామ్ సుందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు వారికి ఖ్యాతి తెచ్చిన గురజాడ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
News September 21, 2025
విజయనగరంలో కేజీ చికెన్ రూ.200

సండే వచ్చిందంటే చాలు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆర్థిక పరిస్థితిని భట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా. చికెన్ (స్కీన్) రూ.200, (స్కీన్ లెస్) రూ.220, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
News September 21, 2025
అతిధి ప్రోటోకాల్ సక్రమంగా చూడాలి: మంత్రి

పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అమ్మవారి పండగ ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం అమ్మవారి పండగ, ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారుల పై గుంతలు లేకుండా చూడాలని, అతిధుల పట్ల ప్రొటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులను ఆదేశించారు.