News February 26, 2025
ఎస్.రాయవరంలో శివరాత్రి రోజున విషాదం

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో శివరాత్రి రోజున విషాదం నెలకొంది. శివరాత్రి సందర్భంగా బుధవారం పెనుగొల్లు గ్రామంలో పక్కుర్తి చరణ్ (20) మరో యువకుడు స్నానానికి దిగారు. వీరికి ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా ఒక యువకుడిని రక్షించారు. అప్పటికే మునిగిపోయిన చరణ్‌ను బయటికి తీయగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Similar News
News February 26, 2025
కాకినాడ: రేపు అన్ని పాఠశాలలకు సెలవు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 27వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ షామ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా పాఠశాలలు తెరిచినట్లయితే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో పర్యవేక్షణ చేయాలని సూచించారు.
News February 26, 2025
సూర్యాపేట: సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ

NLG, KMM, WGL శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సూర్యాపేట జిల్లా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ బుధవారం సందర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
News February 26, 2025
బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చేనేత పట్టు వస్త్రాలను బహూకరించారు. ప్రతిఏటా ఆనవాయితీగా సారెను సమర్పిస్తున్నారు. ప్రధాన కైంకర్యపరులుగా ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావు, గౌరీ, గుత్తికొండ ధనుంజయరావు,విజయ దంపతులు వ్యవహరించారు. ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి రత్నరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.