News January 7, 2026

‘ఏంజీఎన్ఆర్ఈజీఎస్ పనులను వేగంగా పూర్తి చేయాలి’

image

సిద్దిపేట జిల్లాలోని ఏంజీఎన్ఆర్ఈజీఎస్ కింద నిర్మాణంలో ఉన్న పనులు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల గూర్చి ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయా గ్రామంలో ఏంజీ ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులు అంగన్వాడి భవనాలు, గ్రామపంచాయతీ భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News February 9, 2026

‘సావర్కర్‌కు భారతరత్న’పై మాటల మంటలు

image

వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్‌తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్‌ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News February 9, 2026

శ్రీకాకుళం: ఎస్పీ పీజీఆర్ఎస్‌లో 53 వినతులు

image

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 53 వినతులు అందినట్లు అదనపు ఎస్పీ కె.వి. రమణ తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అందిన వినతులపై తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News February 9, 2026

పోలింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, సంబంధిత ఎన్నికల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటషన్ సెంటర్లో వసతులు బాగుండాలని అధికారులను ఆదేశించారు.