News January 5, 2026
ఏంటీ ‘ట్రంపరితనం’.. కొత్త యుద్ధాలు తప్పవా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ అరెస్టు చేయడం, <<18765231>>గ్రీన్‌ల్యాండ్‌పైనా<<>> కన్నేయడం భయాందోళనలకు దారితీస్తోంది. తాను 8 యుద్ధాలను ఆపానని, శాంతిదూతనని గొప్పలు చెప్పుకునే ట్రంప్ తెంపరి చేష్టలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు చిన్న దేశాల మనుగడకు ప్రమాదకరమని, చైనా, రష్యా, ఉ.కొరియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మరింత విజృంభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 2026లోనూ కొత్త యుద్ధాలకు ఆస్కారం ఉందంటున్నారు.
Similar News
News January 30, 2026
మార్చినాటికి విజయవాడ బైపాస్ పూర్తి: గడ్కరీ

AP: గొల్లపూడి నుంచి చినకాకాని(17.88KM) వరకు చేపట్టిన VJA బైపాస్ MARనాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. లోక్‌సభలో MP బాలశౌరి అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. ‘ఈ ప్రాజెక్టులో 4KM మేర మాత్రమే పనులు పెండింగ్ ఉన్నాయి. వాటిని మార్చి31 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. 2019లో ఈ 6వరసల బైపాస్ నిర్మాణానికి రూ.1,194cr అంచనావ్యయంతో అనుమతులిచ్చారు.
News January 30, 2026
చిన్నవయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుందంటే?

జుట్టు రంగు మెలనిన్ అనే పిగ్మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. శరీరంలో విటమిన్ B12 లోపం ఏర్పడినప్పుడు.. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి, జుట్టు తెల్లబడుతుందంటున్నారు నిపుణులు. విటమిన్ B12 ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, నాడీ వ్యవస్థకు చాలా అవసరం. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడటమే కాకుండా వయసు కంటే ముందే తెల్లబడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
News January 30, 2026
నేడు గ్రూప్-1 ఫలితాలు విడుదల?

AP: గ్రూప్-1 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ బుధవారం జరిగిన విచారణలో కోర్టు ఆదేశాలకు లోబడి రిజల్ట్స్ ఇవ్వొచ్చని HC చెప్పింది. అటు క్రీడా కోటకు సంబంధించిన కేసు ఉన్నప్పటికీ రిజర్వేషన్ రోస్టర్ కేసులో స్టే లేకపోవడంతో రిజల్ట్స్ ఇవ్వాలని APPSC సిద్ధమైనట్లు సమాచారం. 2023 DECలో 81 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ రాగా 2024 MARలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్, జూన్‌లో ఇంటర్వ్యూలు జరిగాయి.


