News May 24, 2024
ఏఆర్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం.. మూడేళ్ల జైలు

ఏఆర్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసులో పవన్, సత్య భవానీశంకరానికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 ఫైన్ విధిస్తూ కాకినాడ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి విజయబాబు గురువారం తీర్పునిచ్చారు. 2020లో కొండయ్యపాలానికి చెందిన సుబ్రహ్మణ్యం, పవన్, సత్య భవానీశంకరం అదే ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ బాలారెడ్డిపై చాక్‌తో దాడి చేశారు. టూ టౌన్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. మూడో నిందితుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడు.
Similar News
News November 8, 2025
ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
News November 8, 2025
రాజమండ్రి: తుఫాను పంట నష్టం అంచనాలు పూర్తి

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తయినట్లు డీఏఓ మాధవరావు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 14,602 హెక్టార్లలో వరి, 1,135 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరికి ఎకరాకు రూ.25 వేలు, మినుముకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.38 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించనున్నట్లు ఆయన వివరించారు.
News November 8, 2025
రాజమండ్రి: నేడు యథావిధిగా పాఠశాలలు

జిల్లాలో రెపు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని డీఈఓ వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలకు ప్రభుత్వం అక్టోబర్ నెల 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సెలవుల స్థానంలో వీటిని భర్తీ చేస్తున్నామన్నారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 14 రెండవ శనివారాల్లో పాఠశాలలు విధిగా పనిచేయాలని విద్యాశాఖ ఆదేశించినట్లు డీఈవో చెప్పారు.


