News September 15, 2025
ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిబద్ధతతో, మరింత బాధ్యతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఈ పదవిని తనకు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేష్ జాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇతర జిల్లాల అధ్యక్షులు, సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 15, 2025
అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఓంబిర్లా

AP: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. తిరుపతి మహిళా సాధికార సదస్సులో రెండోరోజు మాట్లాడారు. ‘భద్రత, ఆత్మనిర్భరత ప్రతి మహిళకు అందాలి. స్త్రీలను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా చర్చించాం. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది PM కల’ అని తెలిపారు.
News September 15, 2025
అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి టీకాలు : డీడీ

జిల్లాలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ డీడీ సోమయ్య తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పశు వ్యాధి నియంత్రణలో భాగంగా పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని ఏడీలు రామచంద్రరావు, చైతన్య కిషోర్‌లతో కలిసి ప్రారంభించారు. నాలుగు మాసాలు నిండిన పశువులకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
News September 15, 2025
సీఎం సదస్సులో నంద్యాల కలెక్టర్

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లతో సదస్సు సోమవారం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ రాజకుమారి గణియా సూచనలు చేశారు. అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు.