News July 19, 2024
ఏకరూప దుస్తుల కుట్టు కూలీ నిధులు మంజూరు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తుల కుట్టు కూలీ నిధులను విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఈ దుస్తులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా సమాఖ్యలు కుట్టి పాఠశాలలకు అందించాయి. ఒక్కో జతకు రూ.50 చొప్పున నిధులు మంజూరు చేశారు.
Similar News
News August 26, 2025
KNR: ‘ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్త దరఖాస్తులు స్వీకరించండి’

ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించాలని KNR కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణానికి సుముఖత చూపని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన కొత్త దరఖాస్తుదారులకు ఇళ్లను కేటాయించాలని ఆమె సూచించారు. ఇళ్ల నిర్మాణ దశలను ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News August 26, 2025
కరీంనగర్: ఆర్టీసీ అన్నవరం, వైజాగ్ బీచ్ టూర్ ప్యాకేజీ

KNR-1డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ బీచ్, ద్వారకతిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటుచేశామని చెప్పారు. AUG 29న సా.5 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి AUG 31న రాత్రి KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,625 నిర్ణయించామన్నారు. వివరాలకు 7382849352 సంప్రదించాలన్నారు.
News August 26, 2025
SRR కళాశాలలో రక్తదాన శిబిరం… 80 మంది విద్యార్థుల రక్తదానం

స్థానిక SRR కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాలలోని 5 NSS యూనిట్ల విద్యార్థులు ఇందులో భాగస్వాములై, సుమారు 80 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. విద్యార్థులు సేవాస్ఫూర్తి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ, బ్రహ్మకుమారి సిస్టర్స్ సహకారంతో, ప్రభుత్వ వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు.