News March 10, 2026

ఏజెన్సీల ‘బ్లాక్’ దందా.. భారీ ధరకు సిలిండర్ల విక్రయం!

image

LPG సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏజెన్సీలు సాధారణ బుకింగ్స్ యాక్సెప్ట్ చేయకుండా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్యాస్ సప్లైలో అంతరాయం ఏర్పడొచ్చని, చూసి వాడుకోవాలంటూ గేటెడ్ కమ్యూనిటీల్లో యాజమాన్యాలు అలర్ట్ SMSలు పంపుతున్నాయి.

Similar News

News April 12, 2026

సంతానం కోసం 6వేల మైళ్ల ప్రయాణం!

image

యురోపియన్ ఈల్స్(చేపలు) సంతానోత్పత్తి ఓ అంతుచిక్కని మిస్టరీ. ఇవి ఐరోపా నదుల నుంచి 6వేల మైళ్లు ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సర్గాసో సముద్రం’లో మాత్రమే గుడ్లు పెడతాయి. పుట్టిన తర్వాత పిల్ల చేపలు కూడా దారి తెలియకపోయినా తిరిగి తమ పూర్వీకులు నివసించిన నదులకే వస్తాయి. ఇదెలా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(44/100)

News April 12, 2026

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్.. ఆయుష్‌కు సిల్వర్

image

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్(BAC) మెన్స్ సింగిల్స్ రన్నరప్‌గా భారత షట్లర్ ఆయుష్ శెట్టి నిలిచారు. చైనా ఆటగాడు షియుక్వితో జరిగిన ఫైనల్‌లో ఆయన 8-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయుష్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. BAC మెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ ఫైనల్ చేరడం 61ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1, 4, 7, 20 స్థానాల్లో ఉన్న వారిని ఓడించి ఆయుష్ ఫైనల్ చేరారు.