News December 31, 2025
ఏటీఎంల భద్రతపై నిజామాబాద్ సీపీ సమీక్ష

జిల్లాలో ATM దొంగతనాల నేపథ్యంలో సీపీ సాయి చైతన్య బ్యాంక్ మేనేజర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటీఎంలో 30 రోజుల బ్యాకప్‌తో కూడిన సీసీ కెమెరాలు, అలారం, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి సమన్వయంతో నేరాలను అరికట్టాలని సూచించారు.
Similar News
News February 21, 2026
శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 21, 2026
ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం?

2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. 11 ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో వసూళ్లపై త్వరలోనే డొంక కదలనుంది.
News February 21, 2026
NZB: విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పు

జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 3 రోజుల్లో సెక్షన్ల మార్పునకు అధికారులు రంగం సిద్ధం చేశారు.


