News February 22, 2025
ఏటూరునాగారంలో దొంగనోటు కలకలం!

ఏటూరునాగారంలో శుక్రవారం రూ.100 దొంగనోటు కలకలం రేపింది. ఓ రిక్షా కార్మికుడి వద్ద దొంగ నోటు వెలుగులోకి వచ్చింది. సదరు రిక్షా కార్మికుడు ఓ కూల్ డ్రింక్ షాపు వద్ద రూ.100 నోటు ఇవ్వగా.. షాపు యజమాని దొంగ నోటును గుర్తించాడు. అయితే ఈ నోటు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు.? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 9, 2026
WGL: ‘ఎడిట్’తో నిలువు దోపిడీ..!

భూభారతి పోర్టల్‌లోని ‘ఎడిట్’ ఆప్షన్‌ను ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు భారీ మోసానికి తెరలేపాడు. యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షల సొమ్మును రూ.వందలకే మార్చి ఖజానాకు గండికొట్టాడు. ఈ ఘటన జనగామలో వెలుగు చూడగా, తహశీల్దార్ ఫిర్యాదుతో వరంగల్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News January 9, 2026
16 ఏళ్లు నిండితేనే గిగ్ వర్కర్‌గా నమోదు

గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదవడానికి 16 ఏళ్లు నిండినవారే అర్హులని కేంద్ర కార్మికశాఖ ఇటీవల వెల్లడించింది. ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంది. రిజిస్టరయిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక UAN వస్తుంది. తర్వాత ఫొటో, ఇతర వివరాలతో డిజిటల్ కార్డు జారీ అవుతుంది. వీరు సామాజిక భద్రత పథకాలకు అర్హులు అవుతారు. కార్మికులు ఏడాదిలో కనీసం 90 రోజులు <<18740165>>పనిచేయాల్సి<<>> ఉంటుంది.
News January 9, 2026
మున్సిపల్ పోరు.. అందరి దృష్టి మంత్రి పొంగులేటి ఇలాఖాపైనే..!

ఏడు పంచాయతీల విలీనంతో 20 వార్డులు, 18,868 మంది ఓటర్లతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించింది. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రేపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల కానుండటంతో అభ్యర్థుల వేట మొదలైంది. భవిష్యత్‌లో కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఇక్కడ పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.


