News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి
ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News February 3, 2025
వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు
వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో కారుణ్య నియామకాలు, ఆపద్బంధువు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రైతు భరోసా, రుణ మాఫీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని కలెక్టర్ అధికారుల సూచించారు.
News February 3, 2025
ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి
యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.
News February 3, 2025
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి సీతక్క
ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.