News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News December 24, 2025
రైతు మృతికి CMదే బాధ్యత: KTR

TG: కొనుగోలు కేంద్రంలో రైతు గుండెపోటుతో మరణించడం బాధాకరమని KTR పేర్కొన్నారు. ‘గద్వాల జిల్లా కలుకుంట్ల మొక్కజొన్న కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. 4రోజులుగా పడిగాపులుగాస్తున్నా పంట కొనకుండా నిండు ప్రాణాన్ని కాంగ్రెస్ బలిగొంది. రెండేళ్లలో 750మందికి పైగా రైతులు మరణించినా సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదు. జమ్మన్న కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
News December 24, 2025
KNR: దక్షిణాది స్థాయి ఈత పోటీలకు స్వరణ్, భువన్ ఎంపిక

హైదరాబాద్‌లో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగే దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కంకణాల స్వరణ్, భువన్ ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వరణ్ బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రజత పతకం సాధించగా.. వాటర్ పోలో జట్టుకు భువన్ ఎంపికయ్యారు. వీరిని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో శ్రీనివాస్‌గౌడ్, కోచ్‌లు అభినందించారు.
News December 24, 2025
హైదరాబాద్‌కు ‘డబుల్’ పవర్?

HYD పాలనలో పెను మార్పులకు సర్కార్ స్కెచ్ వేస్తోంది. అడ్మినిస్ట్రేషన్‌ను రెండు భాగాలుగా చీల్చి, పర్యవేక్షణను పక్కాగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఓఆర్‌ఆర్ లోపల GHMC మొత్తాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి అప్పగించి, ఆయనే కమిషనర్‌గానూ వ్యవహరించేలా భారీ ప్లాన్ సిద్ధమవుతోంది. ఓఆర్‌ఆర్ అవతల శరవేగంగా వెలుస్తున్న మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను మరొక ఉన్నతాధికారికి అప్పగించనున్నారు.


