News February 23, 2025
ఏటూరునాగారం ఐటీడీఏ గిరిజన మహిళలకు శిక్షణ

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో చేపట్టినట్లు జేడీఎం కొండలరావు తెలిపారు. ఉట్నూరులో తయారీ అవుతున్న ఇప్పపువ్వు లడ్డు, నాప్కిన్ తయారీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు అభివృద్ధి చెందడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తయారీకి ఉపయోగించే ముడి సరుకు, నాణ్యత గురించి తెలుసుకున్నారన్నారు.
Similar News
News November 11, 2025
ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్‌తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.
News November 11, 2025
వికారాబాద్: కల్లు దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా.?

వికారాబాద్ జిల్లాలో కల్లు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా SP నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి SHOలు షాపు యజమానులకు సూచించారు. అయితే ఇప్పటి వరకు పలు దుకాణాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయలేకపోయారు. SP ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 11, 2025
చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


