News March 24, 2025

ఏటూరునాగారం: గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

image

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ చేసిన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 4న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా సూచించారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.

Similar News

News March 26, 2025

పత్తికొండ వాసి రామ్మోహన్‌కు సేవా పురస్కారం

image

పత్తికొండకు చెందిన కేపీఆర్ మైత్రి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ అచీవర్స్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.

News March 26, 2025

రాష్ట్రవ్యాప్తంగా ULBల్లో ఓటీఎస్ అమలు

image

TG: జీహెచ్ఎంసీతో సహా అర్బన్ లోకల్ బాడీ(ULB)ల్లో ఆస్తి పన్నుపై వడ్డీ చెల్లింపునకు ‘వన్ టైం సెటిల్‌మెంట్(OTS)’ పథకాన్ని పురపాలక మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలు, పెనాల్టీలపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

News March 26, 2025

సిద్దిపేట: ‘పట్టుదల, లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే’

image

పట్టుదల, స్పష్టమైన లక్ష్యం, నిర్దిష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే సివిల్ సర్వీసెస్ పరీక్షలు సులభంగా పాస్ కావచ్చని సిద్దిపేట కలెక్టర్ ఎం.మనుచౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని తెలంగాణ స్కిల్ & నాలెడ్జ్ సెంటర్, కెరీర్ అండ్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

error: Content is protected !!