News March 30, 2025

ఏటూరునాగారం: గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు

image

ఏటూరునాగారంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువుకున్నారు. తన ప్రతిభను నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో అన్నింటిని దాటుకొని గ్రూప్-1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.డీఎస్పీగా ఎంపికయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Similar News

News November 14, 2025

రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: ప్రముఖ బ్రూక్‌ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌ గెలుపు.. కలిసొచ్చింది ఇవే!

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపునకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో అతి ముఖ్యమైనవి పరిశీలిస్తే..
1.రేసుగుర్రం నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం (కలిసొచ్చిన స్థానికత)
2.స్టార్ క్యాంపెయినర్‌గా CM ప్రచారం (ప్రజల్లో చైతన్యం)
3.అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం(మైనార్టీలు INCకి మొగ్గు)
4.MIM మిత్రపక్షం
5.గల్లీల్లో మంత్రుల పర్యటన.. బస్తీల్లో అభివృద్ధి మంత్రం
6.పోలింగ్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్

News November 14, 2025

బీజేపీకి షాక్.. డిపాజిట్ గల్లంతు

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.