News November 7, 2025
ఏటూరునాగారం ఫారెస్ట్‌లో సీతాకోక చిలుకల సర్వే

ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ అభయారణ్యం పరిసరాలలో సీతాకోకచిలుకలు, చిమ్మెటలపై సర్వే గురువారం ప్రారంభమైంది. అడవుల విస్తరణ, పునరుత్పత్తికి దోహదపడే వీటి సంతతి, మనుగడపై ఈ సర్వే ఈనెల 9 వరకు జరగనుంది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేను డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 33 మంది నిపుణులు పాల్గొంటున్నారు.
Similar News
News November 7, 2025
HYD: వాట్సప్‌లో ‘ది ఎండ్’ అని స్టేటస్.. యువతి సూసైడ్ అటెంప్ట్

ఔషాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో BSC నర్సింగ్ 3rd ఇయర్ విద్యార్థిని పూజిత (22) కాలేజీ బిల్డింగ్ నుంచి దూకిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలు కాగా ఆమెను నిమ్స్‌కు తరలించారు. అన్నోజిగూడలో నివాసం ఉంటోంది. జ్వరం రావడంతో కళాశాలకు స్నేహితులతో వచ్చింది. బుధవారం వాట్సప్ స్టేటస్‌లో ‘ది ఎండ్’ అని పెట్టుకుంది. మధ్యాహ్నం లంచ్‌కి రాకుండా ఫోన్‌లో మాట్లాడి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
News November 7, 2025
తక్కువ పంటకాలం – రబీకి అనువైన వరి రకాలు

రబీ సాగుకు తక్కువ కాలపరిమితి, తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలి. అందులో కొన్ని M.T.U 1010(కాటన్ దొర సన్నాలు), M.T.U 1156( తరంగిణి), M.T.U 1153(చంద్ర), M.T.U 1293, M.T.U 1273, M.T.U 1290. వీటి పంటకాలం 120 రోజులు. వీటిలో కొన్ని పొడుగు సన్నగింజ రకాలు. దిగుబడి ఎకరాకు 3-3.2 టన్నులు. చేనుపై పడిపోవు. అగ్గితెగులును తట్టుకుంటాయి.✍️ మరిన్ని వరి రకాలు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 7, 2025
ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టండి

సాధారణంగా రాత్రుళ్లు మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, భవిష్యత్ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. ఏదైనా పనిచేశాక ఫలితాన్ని దానికే వదిలెయ్యాలి. వరుస వైఫల్యాలు ఎదురవుతోంటే మనసు గాయపడి ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కానీ వాటిని పక్కనపెట్టి తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా విజయం సాధించవచ్చని ఆలోచించండి.


