News April 17, 2025
ఏటూరునాగారం: వడదెబ్బతో కూలీ మృతి

వడదెబ్బతో కూలీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. 1వ వార్డుకు చెందిన వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు(62) ప్రతి రోజు సమీపంలోని పంట పొలాలు, మిర్చి కల్లాల వద్దకు పనులకు వెళ్లేవారు. బుధవారం రాత్రి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే వెంకటేశ్వర్లు మృతి చెందారు.
Similar News
News December 22, 2025
KNR: పత్తి రైతుకు మళ్లీ ‘ధర దెబ్బ’..!

కరీంనగర్ జిల్లాలో పత్తి పండించే రైతులపై మరో ఆర్థిక భారం పడింది. పత్తి నాణ్యత(పింజు పొడవు) తగ్గిందనే సాకుతో సీసీఐ మద్దతు ధరలో సోమవారం నుంచి మరో రూ.50 కోత విధించనుంది. గతనెలలో ఇప్పటికే రూ.50 తగ్గించగా, తాజాగా మరో రూ.50 తగ్గించడంతో క్వింటా పత్తి ధర రూ.8,010 కి పడిపోయింది. తమ కష్టార్జితానికి నాణ్యత పేరుతో ధర తగ్గించడంపై పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 22, 2025
జగిత్యాల: కొత్త సర్పంచులకు సవాళ్లెన్నో..!

నేడు కొలువుదీరనున్న గ్రామపంచాయతీ పాలక వర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతేడాది FEBలోనే వీరి పదవి గడువు ముగియడంతో BC రిజర్వేషన్లు, ఇతర కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈనెల 11 నుంచి 17వరకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇక అరకొర నిధులతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు కొత్త సర్పంచులకు సవాల్‌గా మారనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 385 గ్రామపంచాయతీలు, 3536 వార్డు స్థానాల్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
News December 22, 2025
రూ.50 లక్షలు ఇచ్చాకే.. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం!

TG: ఏకగ్రీవం చేస్తే ఇస్తానన్న ₹50 లక్షలు ఇచ్చాకే సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేయాలని యాదాద్రి(D) మైలారుగూడెం వాసులు పట్టుబట్టారు. BRS బలపరిచిన కొండల్ రెడ్డి హామీతో గ్రామస్థులు కాంగ్రెస్ మద్దతుదారును ఒప్పించి నామినేషన్ విత్‌డ్రా చేయించారు. దీంతో ఏకగ్రీవమైన కొండల్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా తర్వాత ఇస్తానంటూ చెప్పారని గ్రామస్థులు తెలిపారు. అయితే ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని కొండల్ చెప్పారు.


