News April 15, 2025
ఏటూరునాగారం: వరి పంటను చూసి కన్నీరు పెట్టిన రైతులు

ఏటూరునాగారం మండల వ్యాప్తంగా ఆదివారం కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వరిపంట నేల వాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన చిన్నదుర్గయ్య అనే రైతు అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంటను సాగు చేశాడని, ఆదివారం వడగళ్ల వర్షం కురవడంతో వరిపంట, వడ్లు రాలిపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 16, 2025
ఉమ్మడి ప.గో. జిల్లాలో 166 పోస్టులు

విద్యాశాఖ పాఠశాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు కొత్తగా 105 SGT, SA కేడర్లలో ఉపాధ్యాయ పోస్టులను ఉమ్మడి ప.గో.జిల్లాకు మంజూరు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు మంజూరైన 61 (SET) పోస్టులతో కలిపితే మొత్తం 166 పోస్టులయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 2,671 మంది ఉండగా, యూడైస్ కోడ్ ఆధారంగా పోస్టులు ఆమోదిస్తారని అభ్యర్థులు భావిస్తున్నారు.
News April 16, 2025
అచ్చంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. మార్చిరీలో శవం

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని ఈగలపెంట ఎస్ఐ వీరమల్లు తెలిపారు. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో గత కొన్ని రోజులుగా భిక్షాటన చేస్తూ ఉండేవాడని అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని అచ్చంపేట హాస్పిటల్‌కి గ్రామస్థులు తరలించారని ఆయన పేర్కొన్నారు. ఈయనను గుర్తుపట్టినవారు ఈగల పెంట పీఎస్, 8712657739, 8712657741, 9000901668 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News April 16, 2025
ఉమ్మడి ప.గో. జిల్లాలో 166 పోస్టులు

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు విద్యాశాఖ కొత్తగా 105 SGT, SA కేడర్లలో ఉపాధ్యాయ పోస్టులను ఉమ్మడి ప.గో.జిల్లాకు మంజూరు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు మంజూరైన 61 (SET) పోస్టులతో కలిపితే మొత్తం 166 పోస్టులయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 2,671 మంది ఉండగా, యూడైస్ కోడ్ ఆధారంగా పోస్టులు ఆమోదిస్తారని అభ్యర్థులు భావిస్తున్నారు.