News October 12, 2025
ఏటూరునాగారం: శిథిలావస్థకు చేరిన రేషన్ సేల్స్ భవనం

ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరులో ఏర్పాటు చేసిన డీఆర్ సేల్స్ డిపో శిథిలావస్థకు చేరింది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్(ఐఏపీ) నిధులతో గతంలో రేషన్ సరఫరా కోసం భవనాన్ని నిర్మించారు. కాలక్రమేపి భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు ప్రధాన ద్వారం షట్టర్ విరిగిపోయింది. దొంగలు, పశువులు భవనంలోకి వెళ్లకుండా నిర్వాహకులు కర్రలను ఏర్పాటు చేశారు. మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News October 12, 2025
‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.
News October 12, 2025
బిట్‌కాయిన్, క్రిప్టో మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

బిట్‌కాయిన్, క్రిప్టో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. మీకు లింకులు పంపితే, వాటిని తెరవవద్దు అన్నారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
News October 12, 2025
Women’s WC: నేడు ఆసీస్‌తో హర్మన్ సేన ఢీ

మహిళల వన్డే WCలో భాగంగా విశాఖ వేదికగా ఇవాళ మ.3 గం.కు INDW-AUSW జట్లు తలపడపనున్నాయి. ఈ మ్యాచ్‌కు అన్ని టికెట్లు బుక్ అవ్వడం విశేషం. భారత్ తొలి 2మ్యాచులు గెలిచి SAతో ఓడిపోయింది. అటు ఆసీస్ టీమ్ మంచి ఫామ్‌లో ఉంది. 2 విజయాలతోపాటు వర్షం కారణంగా SLతో మ్యాచ్ రద్దవడంతో పాయింట్లు పంచుకుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న AUSపై గెలవాలంటే కచ్చితంగా IND టాపార్డర్ సత్తా చాటాల్సిందే.