News April 3, 2025

ఏటూరునాగారం: 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

image

ఇటీవల విడుదలైన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన అజారుద్దీన్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలో విడుదలైన టిజిటి, పిజిటి, గురుకులం జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సైతం సాధించినట్లు తెలిపారు. 4 ఉద్యోగాలు సాధించగా అందులో జూనియర్ లెక్చరర్ (గెజిటెడ్) ఉద్యోగంలో చేరినట్లు పేర్కొన్నాడు. కాగా అజారుద్దీన్‌ను స్థానికులు ఘనంగా సత్కరించారు.

Similar News

News April 3, 2025

ఇంకెప్పుడు మంత్రివర్గ విస్తరణ?

image

TG: మంత్రివర్గ విస్తరణ ప్రహసనంగా మారిపోయింది. GOVT ఏర్పడి ఏడాదిన్నర దాటినా, ఎన్నోసార్లు CM ఢిల్లీకి వెళ్లొచ్చినా అడుగు ముందుకు పడట్లేదు. తాజాగా APR 3, 4వ తేదీల్లో ప్రమాణ స్వీకారమంటూ వచ్చిన వార్తలు గాల్లో కలిసిపోయాయి. 6 బెర్తుల కోసం ఆశావహులు కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇలా ఆలస్యం చేయడంతో పార్టీపరంగా నష్టమే ఎక్కువని, ప్రజల్లోనూ చులకనయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?

News April 3, 2025

SRHకు బిగ్ షాక్

image

IPLలో SRH తీరు మారడం లేదు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ మరోసారి తీవ్ర నిరాశకు గురిచేశారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే 4 రన్స్ కొట్టి హెడ్ ఔట్ కాగా తర్వాతి ఓవర్‌లో అభిషేక్ 2 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్ కిషన్(2) కూడా క్యాచ్ ఔట్ అయ్యారు. దీంతో 201 రన్స్ భారీ టార్గెట్ ఛేదనలో SRH 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

News April 3, 2025

పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైలు: విశాఖ సీపీ

image

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు. పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైళ్ళు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.

error: Content is protected !!