News July 11, 2025
ఏటూరునాగారం: GREAT.. 2 కి.మీ నడిచి వైద్య శిబిరం

జ్వరం వస్తే ఆసుపత్రికి రావాలని, సొంత చికిత్సలు చేసుకోవద్దని ఏటూరునాగారం మండలం గంటలకుంట గుత్తికోయలకు వైద్యాధికారి సుమలత సూచించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు 2 కి.మీ నడిచి హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. క్యాంపులో 28 మందికి పరీక్షలు నిర్వహించి, జ్వరాల బారిన పడ్డ ఐదుగురికి మందులను పంపిణీ చేశామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించినట్లు పేర్కొన్నారు.
Similar News
News July 11, 2025
కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది. సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది. అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. కైలాసగిరిపై ఇది మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.
News July 11, 2025
త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
News July 11, 2025
రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.