News December 28, 2025

ఏడవ నేర్చిన వ్యవసాయము

image

ఒక పనిని ఇష్టం లేకుండా, అయిష్టంగా లేదా ఏడుస్తూ చేస్తే అది ఎప్పటికీ విజయవంతం కాదు. వ్యవసాయం వంటి శ్రమతో కూడిన పనులను ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో చేయాలి. అలా కాకుండా “ఏడుస్తూ” లేదా అయిష్టంగా చేస్తే, ఆ పంట సరిగా పండదు, పైగా అది నష్టాలకే దారితీస్తుంది. ఎవరైనా ఒక పనిని అయిష్టంగా చేస్తే దాని వల్ల ప్రయోజనం లేదని తెలిపే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

Similar News

News December 29, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతుల మృతి

image

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన (25), ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన (24) ప్రాణాలు వదిలారు. వీరు MS పూర్తి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 29, 2025

NCDCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NCDC) 4యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA-ఇంటర్మీడియట్, ICWA-ఇంటర్మీడియట్, ఎంకామ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం రూ.25,000-రూ.40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncdc.in

News December 29, 2025

అనర్హత వేటు తప్పింది: కేసీఆర్ మళ్లీ వస్తారా..?

image

TG: అసెంబ్లీకి KCR అలా వచ్చి, రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. దీంతో రూల్ ప్రకారం 6 నెలలు సభకు హాజరు కాకుంటే MLA పదవిపై పడే అనర్హత వేటు తప్పింది. ఈసారి సెషన్స్‌లో జల వివాదాలపై చర్చిద్దామని, KCR రావాలని CM రేవంత్ సహా మంత్రులు సవాల్ విసిరారు. అంతకుముందు KCR వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై చర్చ కోసం KCR మళ్లీ సభకు వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.