News September 24, 2025
ఏడాదిలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం: కలెక్టర్

ఖమ్మం: సంవత్సరం కాలంలోనే కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెంలో ఆయన మాట్లాడుతూ.. కోల్డ్ స్టోరేజ్ కోసం అవసరమైన 10 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంతో స్థానిక రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఉద్యానవన పంటలు, మిర్చి పంటలను సాగు చేసే రైతులు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు.
Similar News
News September 24, 2025
మొదటి విడతలో 16,300 ఇళ్లు మంజూరు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మొదటి విడత కింద 16,300 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే 14 వేలకు పైగా ఇళ్లు మార్కింగ్ చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి మేరకు ప్రతి సోమవారం నిధులు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. మన జిల్లాలో ఇప్పటి వరకు రూ.142 కోట్లను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలలో జమ చేశామని పేర్కొన్నారు.
News September 24, 2025
రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ: మంత్రి

రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం యం. వెంకటాయపాలెం గ్రామంలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 9,700 మెట్రిక్ టన్నుల శీతల గోదాముల నిర్మాణానికి కలెక్టర్, సీపీతో కలిసి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు.
News September 24, 2025
టన్ను ఇసుక రూ. 1,100 కే విక్రయం: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గోదావరి ఇసుకను టన్నుకు రూ. 1,100 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. కూసుమంచి, మధిర, సత్తుపల్లి, కామేపల్లి, ఖమ్మంలో ఈ ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఐదు బజార్లలో మొత్తం 5,194 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు.