News March 12, 2026
ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి ముప్పు

పేదల తిరుపతిగా పేరుగాంచిన ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి రానున్న కాలంలో ముప్పు తలపించే అవకాశం ఉందని దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తుతుమంత్రంగా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారని అన్నారు. మొత్తానికి దేవాలయం పరిసర ప్రాంతాలలో క్రషర్ మిషన్ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ ఉండే ఏడుకొండలను తవ్వాలని ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
MBNR: మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

మహబూబ్‌నగర్ పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ జయప్రద తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిజెడ్సీ, బీఏ కోర్సుల్లో చేరాలనుకునే వారు ‘దోస్త్’ (DOST) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలు, 8 ఫొటోలతో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
News April 20, 2026
మహబూబ్‌నగర్: ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లాలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎస్పీ జానకి తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మైనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
News April 20, 2026
MBNR: అక్కడ.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్ 43.3, దేవరకద్ర 43.2, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.6, అడ్డాకుల 42.4, కోయిలకొండ మండలం పారుపల్లి 42.0, చిన్న చింతకుంట 41.8, జడ్చర్ల 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


