News March 24, 2024
ఏడుపాయలలో కనుల పండువగా దుర్గమ్మ పల్లకి సేవ

ఏడుపాయల వన దుర్గమ్మ సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ కనుల పండువగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకోగా పల్లకి సేవలో పాల్గొని భక్తులు తరించిపోయారు.
Similar News
News April 15, 2025
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం ఎంతంటే..?

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక ఆదాయం ఆలయ ఈవో అన్నపూర్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024-25 సంవత్సర నికర ఆదాయం రూ. 20,97,93,956 వచ్చిందన్నారు. గత సంవత్సరం నికర ఆదాయం కంటే రూ. 2,23,29,490 అధికంగా సమకూరిందన్నారు. వార్షిక ఆదాయం రూ.45,81,77,096 కోట్లు వచ్చిందన్నారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో బుద్ధి శ్రీని వాస్, పాల్గొన్నారు.
News April 14, 2025
మనోహరాబాద్: యువతి అదృశ్యం..!

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ‘కాళ్లకల్కు చెందిన మన్నె నాగలక్ష్మి (19) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అత్వెల్లి వద్దగల నేషనల్ మార్ట్లో పనిచేసేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళింది. రాత్రి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని’ చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు
News April 14, 2025
మెదక్: అంబేడ్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఏఎస్పీ

అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత ఆయనను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.