News April 5, 2024
ఏడుపాయలలో నీట మునిగి వ్యక్తి మృతి

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు నీట మునిగి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. HYD సంజీవరెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్(28) బంధువులతో కలసి ఏడుపాయలకు వచ్చాడు. స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీర పాయల్లో మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News September 9, 2025
మెదక్: కాళోజీ సేవలు చిరస్మరణీయం: డీఆర్ఓ

స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాళోజి నారాయణరావు సేవలు చిరస్మరణీయమని డీఆర్ఓ భుజంగరావు అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ వ్యక్తిత్వం, రచనలు ప్రజలను చైతన్య పరిచాయన్నారు. ఆయన చూపిన దారిని విడవొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో యూనస్, అధికారులు పాల్గొన్నారు.
News September 9, 2025
మెదక్: ప్రజాకవి కాళోజీకి ఎస్పీ నివాళులు

జాతీయ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణకు కవిత్వం ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానుభావులని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్ చంద్ర బోస్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 9, 2025
మెదక్: ‘ఫిర్యాదుల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలి’

మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం అమలులో ఉన్నట్లు జిల్లా అధికారి హేమ భార్గవి తెలిపారు. ఈ చట్టం ప్రభుత్వం, ప్రైవేట్ ప్రతి యజమాని లైంగిక వేధింపులు లేని కార్యాలయాన్ని అందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అంతర్గత ఫిర్యాదులు, కార్యాలయంలో లైంగిక వేదింపుల ఫిర్యాదులను పరిష్కారం కోసం ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.