News February 28, 2025
ఏడుపాయలలో బోనంతో జోగు శ్యామల సందడి

ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం రాత్రి జోగు శ్యామల బోనంతో సందడి చేశారు. శ్యామల నెత్తిపై బోనం, చేతిలో త్రిశూలం చర్నాకోలతో ముందుకు సాగుతుండగా యువకులు, మహిళలు, భక్తులు కేరింతలతో హోరెత్తించారు. అనంతరం శ్యామల బోనం వన దుర్గామాత అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఆవిష్కృతమైంది. జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Similar News
News April 21, 2025
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి: మంత్రి

వడదెబ్బ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు.
News April 21, 2025
మెదక్: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం సంబంధిత కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో తెలపాలని ఎస్పీ సూచించారు.
News April 21, 2025
BREAKING: తూప్రాన్: ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి

మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో హల్దీ వాగులో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.