News March 1, 2025
ఏడుపాయలలో విషాదం.. నదిలో మునిగి ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ముగింపు తర్వాత విషాదం నెలకొంది. పోతంశెట్టిపల్లి శివారులో 2వ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. శనివారం స్నానం కోసం నలుగురు యువకులు దిగారు. వీరిలో కృష్ణ(20), షామా(21) ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు బయటపడ్డారు. మృతదేహాలను మెదక్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ ఇందిరా నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Similar News
News March 1, 2025
ఈనెల 4న సంగారెడ్డిలో సృజన టెక్ ఫెస్ట్

సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 4న జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ పి. జానకి దేవి శనివారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ టెక్ ఫెస్టులో పాల్గొంటాయని ప్రిన్సిపల్ తెలిపారు.
News March 1, 2025
మోడల్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

మోడల్ స్కూల్లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి 6 – 10 తరగుతుల్లో అడ్మిషన్లకు మార్చ్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… https:///telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు తీసుకోవచ్చు అన్నారు. ఏప్రిల్ 13న దరఖాస్తు చేసిన వారికి పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు.
News March 1, 2025
మెదక్: నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: SP

మార్చి 1 నుంచి 31 వరకు మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.