News May 7, 2025

ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్‌కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లిన వీరస్వామి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందారు. దీంతో విందులో విషాదం నెలకొంది.

Similar News

News February 21, 2026

మెదక్‌లో అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి

image

మెదక్‌లోని శ్మశానవాటిక సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సజీద్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఈఎంటీ రామవ్వ, పైలట్ రఘు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. టౌన్ SI రుక్సానా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News February 21, 2026

మెదక్: మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC)లో సభ్యత్వం పొందేందుకు జీఓ 252 ప్రకారం జిల్లాలోని మీడియా అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.

News February 20, 2026

ఇంటర్ పరీక్షలకు మెదక్ జిల్లా విద్యార్థులు సిద్ధం

image

* ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల
* పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య: 12,334
* ప్రథమ సంవత్సరం 6,309 (ఒకేషనల్ 599)
* ద్వితీయ సంవత్సరం 6,025 (ఒకేషనల్ 553)
* జిల్లాలో మొత్తం పరీక్ష కేంద్రాలు : 28
* అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు నిఘా
* పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, యాడ్ తదితరవి సిద్ధం చేసుకోండి
పరీక్షలంటే టెన్షన్ వద్దు.. ఒత్తిడిని జయిస్తే మీదే విజయం