News January 28, 2026
ఏడుపాయల జాతర ఎల్లలు దాటేలా నిర్వహించాలి: కలెక్టర్

ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక ధరలు, కల్తీ ఆహారం, మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 20, 2026
ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు

సిద్దిపేటను మెడికల్, పారామెడికల్ కాలేజీలు, ఐటీ టవర్‌తో అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దామని MLA హరీశ్ రావు తెలిపారు. ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, మొబైల్ వ్యసనాలకు దూరంగా కష్టపడి చదివితే పేదరికం అడ్డుకాదని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
News February 20, 2026
మెదక్: 22న బేస్ లైన్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలకు ఎస్.వెంకటస్వామి కో ఆర్డినేటర్ 8008403635 ఫోన్ చేయాలని సూచించారు.
News February 19, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార వాహనాన్ని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


