News February 26, 2025
ఏడుపాయల బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద భారీ ఎత్తున జాతర ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.
Similar News
News July 9, 2025
మెదక్: మిగిలిన సీట్లకు లాటరీ తీసిన కలెక్టర్

మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకంలో మిగిలిన సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ స్కీం నందు మిగిలిన సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
News July 9, 2025
మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.
News July 9, 2025
మెదక్: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు.!

ఓపెన్ స్కూల్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. బడి మానేసిన పిల్లలకు ఓపెన్ స్కూల్ వరం అని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.telanganaopenschool.org/ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.