News May 20, 2024
ఏడుపాయల హుండీ ఆదాయం రూ.47.50 లక్షలు
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవానీ మాతా ఆలయం హుండీ ఆదాయం రూ.47,50,681 వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి, ఛైర్మన్ సాతెల్లి బాలాగౌడ్ తెలిపారు. సోమవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో భ్రమరాంభిక సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గోకుల్ షెడ్‌లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
Similar News
News November 28, 2024
మెదక్: కుతూరిని చంపిన తండ్రికి జీవిత ఖైదు
కూతుర్ని హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదుతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మి శారద బుధవారం తీర్పునిచ్చారు. టేక్మాల్ మండలం పాల్వంచకు చెందిన రమణయ్య(27)ను సావిత్రి రెండో పెళ్లి చేసుకుంది. కాగా అప్పటికే పుట్టిన వర్షిని(3)పై కక్ష పెంచుకున్న రమణయ్య 2021లో గొంతు నులిమి చంపేశాడు. ఈ కేసుపై విచారించి న్యాయమూర్తి ఈమేరకు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.
News November 28, 2024
MDK: జనవరి వరకు చలిపంజా.. జాగ్రత్తలు తప్పనిసరి !
ఉమ్మడి మెదక్ జిల్లాలో జనవరి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు రావడతతోపాటు కండరాలు కుచించుకుపోయి రక్తనాళాలు గడ్డ కట్టుకుపోయి ఇతర జబ్బులు వచ్చే ఆస్కారముందన్నారు. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేడి చేసిన నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
News November 28, 2024
సంగారెడ్డి: డిసెంబర్ 4న నాస్ పరీక్ష
సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో డిసెంబర్ 4న నేషనల్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ నాస్ పరీక్షకు విద్యార్థులను సంసిద్ధులుగా చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.