News August 29, 2025

ఏడు పదుల వయసులో పద్యానికి ప్రాణం పోస్తూ

image

తెలుగు భాషను బతికించి భావితరాలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో 76 వయసులో గుంటూరుకు చెందిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ తనదైన శైలిలో సేవ చేస్తున్నారు.’తెలుగు కావ్య మథనం” పేరుతో వాట్సప్ గ్రూప్‌ ఏర్పాటు చేసి పద్యరచనపై శిక్షణ ఇస్తున్నారు. 2019 నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, వ్యాపారాల్లో ఉన్న భాషాభిమానులంతా సభ్యులుగా చేరారు. 2025లో ఆయనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.

Similar News

News September 2, 2025

NTR: సర్వర్ నెపంతో సచివాలయాల్లో నిలిచిపోయిన పనులు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వర్ పనిచేయడం లేదన్న సాకుతో ప్రజల సమస్యల పరిష్కారంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వర్ సమస్య కేవలం 10-15 నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ, సిబ్బంది మాత్రం ఆ రోజు మొత్తం పనిచేయదని చెప్పి ప్రజలను వెనక్కి పంపుతున్నారు. సచివాలయాల్లో ఒకే ఒక్క డిజిటల్ అసిస్టెంట్ ఉండటంతో ఈ సమస్య తలెత్తుతోందని సిబ్బంది చెబుతున్నారు.

News September 2, 2025

HYD: Ed.CET సెకండ్ ఫేజ్ నేటితో లాస్ట్

image

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగుస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనని వారికి, వెబ్ ఆప్షన్ ఛాన్స్ ఉండదని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొనాలని సూచించారు.

News September 2, 2025

క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

NTR జిల్లాల్లో రెవెన్యూ సమస్యలు పదేపదే ఎదురవుతుండటంపై కలెక్టర్ లక్ష్మీశా ఎమ్మార్వోలు, ఆర్డీవోల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. PGRSకు వస్తున్న ఫిర్యాదుల్లో 30-40% రెవెన్యూ సమస్యలే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఇకపై ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఫిర్యాదు దారుల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.