News February 25, 2025
ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.. స్పందించిన హోం మంత్రి

అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడాం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని, గుండాల కోనకు వెళ్లే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలి’ అని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 25, 2025
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు నిందితులకు ముందస్తు బెయిల్

AP: YCP హయాంలో చంద్రబాబు ఇల్లు, TDP ఆఫీసుపై జరిగిన దాడి కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా 20 మందికి ఊరట దక్కింది. అయితే విచారణకు సహకరించాలని, దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. విచారణను 3 ఏళ్లు తాత్సారం చేశారని వ్యాఖ్యానించింది. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని, అధికారం పోయాక కోర్టుకు వచ్చారని ప్రభుత్వం వాదనలు వినిపించింది.
News February 25, 2025
వరంగల్: రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి(మంగళవారం) నుంచి గురువారం వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 27 తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవని అధికారులు తెలిపారు. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, మూసివేయాలని కలెక్టర్ సత్య శారద దేవి ఆదేశించారు.
News February 25, 2025
జిల్లాకు చేరుకున్న ప్రశ్న పత్రాలు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రత్యేక వాహనంలో పకడ్బందీ బందోబస్తు నడుము ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రానికి పంపారు. వీటిని కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి