News January 2, 2026
ఏపీకి రానున్న సోనియా గాంధీ, రాహుల్

AP: ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే ఆందోళనల్లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు. ఈ గ్రామంలోనే 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. దీంతో అదే రోజున, అదే ప్రాంతంలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
Similar News
News January 8, 2026
రెండేళ్లలోపే ₹3.02 లక్షల కోట్ల అప్పు: జగన్

AP: 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ₹3,90,247 కోట్ల అప్పు ఉందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ‘మా హయాంలో ₹3,32,671 కోట్ల రుణాలు తీసుకుంటే ₹2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. చంద్రబాబు ఇప్పుడు రెండేళ్లలోపే ₹3,02,303 కోట్ల అప్పు చేశారు. కానీ అదంతా ఏం చేశారో తెలియదు. మేం సంక్షేమానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాబు అప్పులకు క్యాలెండర్ రిలీజ్ చేశారు’ అని ఎద్దేవా చేశారు.
News January 8, 2026
క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.
News January 8, 2026
హార్దిక్ విధ్వంసం.. 31 బంతుల్లోనే

విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ పాండ్య(బరోడా) సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. ఇవాళ చండీగఢ్‌పై 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆయన మొత్తంగా 31 బాల్స్‌లో 75 రన్స్(9 సిక్సర్లు, 2 ఫోర్లు) బాదారు. ప్రియాంశ్(113), విష్ణు(54), జితేశ్(73) రాణించడంతో బరోడా 391 రన్స్ చేసింది. కాగా విదర్భపై తొలి మ్యాచ్‌లోనూ హార్దిక్ 92 బంతుల్లో 133 రన్స్(11 సిక్సర్లు, 8 ఫోర్లు) చేసిన విషయం తెలిసిందే.


