News January 17, 2026
ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరం: ASF ఎస్పీ

మొబైల్ ఫోన్స్‌కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ASF జిల్లా ఎస్పీ నితిక పంత్ సూచించారు. ఫైల్స్ ఓపెన్ చేస్తే సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి ఫైల్స్ ఓపెన్ చేస్తే మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని వివరించారు.
Similar News
News February 16, 2026
గర్భిణీలకు టిఫా స్కాన్ ఎందుకు?

టిఫా అంటే ‘టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్’. గర్భిణులకు 18-22 వారాల మధ్య ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. శిశువు, మాయ పొజిషన్, ఉమ్మనీరు ఎంత ఉంది అన్నవి ఇందులో గుర్తిస్తారు. ఈ స్కాన్ ద్వారా చిన్నారుల్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే గుర్తించి అందుకు తగిన వైద్యం అందించి తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
News February 16, 2026
సంగారెడ్డి: ‘రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి’

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి కార్యాలయంలో స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని పోలీసులకు టీ షర్ట్‌లను మంగళవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News February 16, 2026
SETSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech (CS, IT, IS, సైబర్ సెక్యూరిటీ, ECE), ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000-రూ.60,000 వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://setsindia.in


