News July 31, 2024

ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!

image

వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల మొబైల్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి సైబర్ నేరాల బారిన పడవద్దన్నారు. ఏవైనా సైబర్ ఫిర్యాదులను 1930కు చేయాలని సూచించారు.

Similar News

News August 31, 2025

తర్లుపాడు PSను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

image

తర్లుపాడు పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి, స్టేషన్‌ రికార్డులు, నేరాల చరిత్ర, కేసుల పురోగతి, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో SI బ్రహ్మ నాయుడు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

News August 30, 2025

రేపు ఒంగోలుకు రానున్న MP మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం ఒంగోలుకు రానున్నట్లు ఎంపీ మాగుంట కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలులోని తన కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ఒంగోలులో జరిగే కార్యక్రమాలలో ఎంపీ మాగుంట రేపు పాల్గొంటారన్నారు. అంతేకాకుండా ఒకటో తేదీ సోమవారం కూడా ఎంపీ మాగుంట తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

News August 30, 2025

ప్రకాశం: బార్ల లైసెన్స్ కోసం 78 దరఖాస్తులు.. కాసేపట్లో లాటరీ..!

image

ఓపెన్ కేటగిరీకి సంబంధించి 26 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, 78 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని కార్యాలయంలో మాట్లాడారు. 26 బార్లకు గాను 17 బార్లకు దరఖాస్తులు అందాయన్నారు. గీత కులాలకు కేటాయించిన 3 బార్లకు 14 వచ్చాయని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందన్నారు.