News January 3, 2026

ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్టులను ఈ నెల 5, 7, 10 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం రాజమండ్రిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐవోఎన్ డిజిటల్ జోన్, రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 21, 2026

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

image

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

News February 21, 2026

నల్లజర్ల: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

image

నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ రవిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆయనను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బస్సు ఆపకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 21, 2026

సంక్షేమ పథకాలే లక్ష్యంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’: కలెక్టర్

image

ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా సహకరించి వివరాలు అందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె కోరారు.