News November 5, 2025
ఏపీలో అగ్రస్థానంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

క్యూఎస్ ఏషియా సంస్థ విడుదల చేసిన 2025-26 విద్యా సంవత్సర ర్యాంకింగ్స్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 761-770 ర్యాంక్ సాధించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ 801-850 ర్యాంకుల్లో, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ 851-900 ర్యాంక్‌లో, శ్రీకృష్ణ యూనివర్సిటీ 1001-1100 ర్యాంక్‌లో నిలిచాయి. ఈ విజయంపై రిజిస్ట్రార్ సింహాచలం అభినందించారు.
Similar News
News March 6, 2026
ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలి: భద్రాద్రి కలెక్టర్

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు సూచనలు చేశారు.
News March 6, 2026
గిరిజన ప్రాంతాల్లో విద్యుద్దీకరణకు ప్రాధాన్యం: సీఎండీ

గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాల విస్తరణకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. ఈఆర్సీ బహిరంగ విచారణలో మాట్లాడుతూ.. PM-JANMANపథకం కింద దూర ప్రాంతాల్లోని 3360 ఇళ్లకు ఆన్‌గ్రిడ్ ద్వారా, 90 ఇళ్లకు ఆఫ్‌గ్రిడ్ ద్వారా విద్యుద్దీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. అలాగే STSDF పథకం ద్వారా గుర్తించిన 2222 గిరిజన ఆవాసాల్లో 2072 ప్రాంతాల్లో విద్యుద్దీకరణ చేశామన్నారు.
News March 6, 2026
ఎల్లుండి ఫైనల్.. అభిషేక్ శర్మ వైపే మొగ్గు!

T20WCలో వరుసగా విఫలం అవుతున్న అభిషేక్ శర్మను పక్కన పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అయితే అతడికి ఫైనల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని టీమ్ యాజమాన్యం యోచిస్తున్నట్లు PTI తెలిపింది. అభిషేక్ దూకుడును సపోర్ట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందని పేర్కొంది. టీమ్‌లో మార్పులు చేస్తే కాంబినేషన్ డిస్టర్బ్ అవుతుందని, అందుకే ఫైనల్లో మార్పులు ఉండకపోవచ్చని పేర్కొంది.


