News February 10, 2026
ఏపీలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు: కేంద్రం

AP: రాష్ట్రంలోని బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279 కోట్లు ఉన్నాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీడీపీ ఎంపీ హరీశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ డబ్బును అసలైన యజమానులకు లేదా వారి వారసులకు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. <<18520571>>‘మీ సొమ్ము- మీ హక్కు’<<>> కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 34వేల ఖాతాలకు చెందిన రూ.161 కోట్లను సెటిల్ చేశామని చెప్పారు.
Similar News
News February 10, 2026
ఎప్‌స్టీన్‌తో మస్క్, జుకర్‌బర్గ్.. ‘వైల్డ్’ డిన్నర్ ఫొటో వైరల్!

ఎప్‌స్టీన్ ఫైల్స్ టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. 2015లో ఎప్‌స్టీన్ ఏర్పాటు చేసిన ఓ ‘వైల్డ్’ డిన్నర్‌లో మస్క్, జుకర్‌బర్గ్ పాల్గొన్నట్లు ఓ ఫొటో బయటపడింది. ఎప్‌స్టీన్ స్వయంగా తన మెయిల్‌లో దీని గురించి ప్రస్తావిస్తూ వారితో డిన్నర్ అదిరిపోయిందని రాసుకున్నాడు. అంతేకాదు గతంలో మస్క్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎప్‌స్టీన్ ప్రైవేట్ ఐలాండ్‌లో పార్టీ ఎప్పుడు ఉంటుందని అడిగిన మెయిల్స్ కూడా బయటకొచ్చాయి.
News February 10, 2026
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

కేరళ, కొల్లాంలోని <


