News April 13, 2024

ఏపీలో ఎన్నికలు.. HYDలో TDP ప్రచారం!

image

టీడీపీ LBనగర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని BNరెడ్డినగర్ డివిజన్ ఇన్‌ఛార్జి గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో జరిపారు. ఉదయగిరి MLA అభ్యర్థి సురేశ్, TTDP అధికార ప్రతినిధి జోష్న హాజరయ్యారు. BNరెడ్డిలోని ఉదయగిరికి చెందిన TDP, NTR అభిమానులు సురేశ్‌కు ఓటు వేయాలని విజయ్ కోరారు. ఆయన గెలుపునకు కృషి చేయాలన్నారు. హర్షత్ నాయుడు, నాగేశ్వరరావు, డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు కార్పెంటర్ శీను పాల్గొన్నారు.

Similar News

News September 23, 2024

గ్రేటర్ HYDలో RTC బస్‌పాస్ REPORT

image

2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ మంత్లీ బస్‌పాస్‌ కొద్ది రోజుల్లోనే 750 మంది కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రూ.1450 విలువైన ఈ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతోంది. ప్రస్తుతం నగరంలో 10,000 మంది ఆర్డినరీ, 75,000 మంది మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు.

News September 23, 2024

రాజేంద్రనగర్: అగ్రి హబ్‌లో స్టార్ట్ అప్స్ జోరు!

image

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రిహబ్‌లో తొలుత 13 స్టార్ట్ అప్స్ ఏర్పాటయ్యాయని CEO విజయ్ తెలిపారు. గత మూడేళ్లలో వాటి సంఖ్య 92కి పెరిగిందని, మరో వెయ్యి అంకురాలు నమోదు చేసుకున్నాయన్నారు. 11 అంకుర సంస్థలు తమ ఆవిష్కరణపై మేధోసంపత్తి హక్కులు పొందాయని, 2,450 మంది తమ ఆలోచనలను పంచుకున్నారు. ఆరు వేల మంది రైతులు పరిశోధన కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.

News September 23, 2024

HYD: అక్టోబర్ 2 నుంచి ఆపరేషన్ సీవరెజ్

image

గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.