News January 6, 2026

ఏపీలో వేగంగా ఎయిర్‌పోర్టులు!

image

ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తిలో డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటీవలే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. రాజమండ్రిలో పనులు జరుగుతుండగా, భోగాపురంలో పూర్తి కావొచ్చింది. కొత్తగా కుప్పం, దొనకొండ (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు)లో ఎయిర్‌పోర్టులకు ప్లాన్ చేస్తున్నారు.

Similar News

News February 16, 2026

గర్భిణీలకు టిఫా స్కాన్ ఎందుకు?

image

టిఫా అంటే ‘టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌’. గర్భిణులకు 18-22 వారాల మధ్య ఈ స్కాన్‌ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. శిశువు, మాయ పొజిషన్, ఉమ్మనీరు ఎంత ఉంది అన్నవి ఇందులో గుర్తిస్తారు. ఈ స్కాన్ ద్వారా చిన్నారుల్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే గుర్తించి అందుకు తగిన వైద్యం అందించి తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

News February 16, 2026

SETSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech (CS, IT, IS, సైబర్ సెక్యూరిటీ, ECE), ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000-రూ.60,000 వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://setsindia.in

News February 16, 2026

సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల

image

TG: సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది.