News August 20, 2025
ఏపీలో శ్రీకాకుళం జిల్లా ముందంజ: కలెక్టర్

పీ-4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా ఏపీలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టర్‌లో మాట్లాడారు. 64,166 బంగారు కుటుంబాల్లో 61,552 కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా లక్ష్యం చేరుకున్నామని వెల్లడించారు. దీంతో 1,55,804 లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. రహదారుల మీదుగా వేలాది మొక్కలు నాటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Similar News
News August 20, 2025
కాశీబుగ్గలో 25న జాబ్ మేళా

కాశీబుగ్గలోని సాయి శిరీషా డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 25న జాబ్ మేళా జరగనుంది. 18 నుంచి 34 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు అర్హులని ఆ సంస్థ అధికారి సాయికుమార్ తెలిపారు. 16 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
News August 20, 2025
SKLM: అభ్యంతరాలను ఆగస్టు 22లోగా తెలియజేయాలి

పలాస రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ-డివిజనల్ మేనేజరు, పోస్ట్‌లకు జిల్లా సెలక్షన్ కమిటీ నియామక పరీక్ష ఆగస్టు 10వ తేదీన నిర్వహించారు. దీనిపై అభ్యంతరాలను ఆగస్టు 22వ తేదీలోగా తెలియజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. https://srikakulam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆ రోజు సాయంత్రం 5లోగా తెలియజేయవచ్చన్నారు.
News August 19, 2025
SKLM: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటి వద్దకే మట్టి విగ్రహం

గణేశ్ చతుర్థి వేడుకలు పర్యావరణహితంగా జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో పర్యావరణహిత గణేశ్ చతుర్థి పోస్టర్‌ను ఆవిష్కరించారు. మట్టి వినాయక విగ్రహాలను వాడటం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని, భక్తి-ప్రకృతి రెండింటినీ కాపాడే బాధ్యత మనందరిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.