News November 19, 2025

ఏపీలో MSME ఎకోసిస్టమ్ బలోపేతానికి సహాయం పెంచండి: మంత్రి

image

ఏపీలోని MSME రంగం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రంతో చర్చలు జరిగాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర MSME మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి & అభివృద్ధి కమిషనర్ డాక్టర్ రజనీష్‌ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న MSME ప్రాజెక్టులు, వాటి పురోగతి, అవసరమైన సహాయంపై వివరించానని, ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి అందే సహాయాన్ని పెంచాల‌ని కోరినట్లు తెలిపారు.

Similar News

News November 19, 2025

మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..!?

image

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

News November 19, 2025

నవంబర్ 19: చరిత్రలో ఈ రోజు

image

*1828: స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జననం
*1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
*1960: సినీ నటుడు శుభలేఖ సుధాకర్ జననం
*1975: మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ జననం
*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
*ప్రపంచ టాయిలెట్ దినోత్సవం

News November 19, 2025

KNR: స్థానిక సమరం షురు.. వచ్చే నెలలో ఎన్నికలకు క్యాబినెట్ పచ్చజెండా

image

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారంతో వీడగా, ఇక పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,216 గ్రామ పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.