News December 31, 2025

ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏయూ

image

రాష్ట్రవ్యాప్తంగా ఏపీసెట్ ప్రవేశ పరీక్ష మార్చి 28, 29వ తేదీల్లో జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రా యూనివర్శిటీ ఈరోజు విడుదల చేసింది. జనవరి 9వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ఏపీసెట్ అర్హతను పరిగణనలోనికి తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం www.apset.net.in వెబ్‌సైట్‌‌ను సంప్రదించండి.

Similar News

News January 7, 2026

గాయం నుంచి కోలుకొని అదరగొట్టిన శ్రేయస్

image

భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ VHTలో అదరగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నిన్న ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఆయన 53 బంతుల్లోనే 82 రన్స్ చేశారు. అందులో 10 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. దీంతో ఈ నెల 11 నుంచి NZతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో శ్రేయస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమైనట్లే. గతేడాది AUSలో వన్డే మ్యాచ్ ఆడుతూ గాయపడిన శ్రేయస్ 2 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

News January 7, 2026

జగన్‌తో తానేటి వనిత భేటీ.. చోడవరం ఫ్లెక్సీ వివాదంపై సుదీర్ఘ చర్చ!

image

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తానేటి వనిత మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా చోడవరం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఫ్లెక్సీల వివాదం, అనంతరం తలెత్తిన పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

News January 7, 2026

రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

image

ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.