News January 8, 2026
ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభం.. అజెండాలో 35 అంశాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సుమారు 35 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలు, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ తదితర అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
Similar News
News January 10, 2026
పత్తి కట్టెలను నేలలో కలియదున్నితే కలిగే లాభాలివే..

పత్తి ఏరిన తర్వాత ఎకరాకు దాదాపు 10- 30 క్వింటాళ్ల పత్తి కట్టె మిగులుతుంది. వీటిని భూమిలో కలియదున్నితే ఎకరాకు 5-30 KGల నత్రజని, పొటాషియం పోషకాలతో పాటు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులను నేలకు అందజేయవచ్చు. దీని వల్ల తర్వాతి పంటల్లో రసాయన ఎరువుల మోతాదు తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. నేలలో తగ్గుతున్న వానపాములను, సూక్ష్మజీవులను రక్షించవచ్చు. నేలకు నీటిని పట్టి ఉంచే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
News January 10, 2026
TGలో చిరంజీవి మూవీ టికెట్ల ధరల పెంపు

TG: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 12న విడుదలవనుండగా.. 11న ప్రీమియర్స్‌కు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. వారంపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకరించింది. సింగిల్ స్క్రీన్‌లో GSTతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
News January 10, 2026
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.


